చీరాల : కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో వాడరేవు తీరంలో భక్తజనం పోటెత్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సముద్ర స్నానాలకు జనం తరలి వచ్చారు. భక్తులతో తీరప్రాంతం సందడిగా మారింది. సూర్యోదయానికి ముందు నుండే జ్వాలా దీప కాంతులతో శివాలయాలు శోభిల్లాయి. శివనామ స్మరణతో మార్మోగాయి. గోత్రనామాలతో అభిషేకములతో, కుంకుమార్చనలతో విశేష పూజా కార్యక్రమాలు చేశారు. మహిళలు సముద్ర స్థానాలు ఆచరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీరప్రాంతంలో రురల్, మెరైన్ పోలీసులు గస్తీ నిర్వహించారు.