Home ప్రకాశం చీరాల కమిషనర్ కు యూటీఎఫ్ అభినందనలు

చీరాల కమిషనర్ కు యూటీఎఫ్ అభినందనలు

295
0

చీరాల : నూతనంగా ఎన్నికైన యుటిఎఫ్ పట్టణ శాఖ కార్యవర్గం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ హక్కులకోసం పోరాడు తుందని, బాధ్యతలకు నిలబడుతుందని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘమునకు కమీషనర్ సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులోనూ నూతన కార్యవర్గానికి కూడా ఇలాగే సహకారం కొనసాగించాలని కోరారు.

కమీషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న బలమైన సంఘం యుటిఎఫ్ అని అన్నారు. తనవంతుగా తన పరిధిలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జానీ బాషా, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు షేక్ మహమ్మద్ ఖాసిం, పట్టణశాఖ అధ్యక్షుడు ఎస్వి సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాసరావు, సహాధ్యక్షులు ఎన్ రాజేష్, మహిళా సహాధ్యక్షులు సిహెచ్ మాధవి, కోశాధికారి సిహెచ్ వెలుగొండారెడ్డి, జిల్లా కౌన్సిలర్ లు కె వీరాంజనేయులు, పి సురేష్, వి విజయలక్ష్మి, సిహెచ్ సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు గవిని నాగేశ్వరరావు, బి పిచ్చయ్య, వి మల్లికార్జునరావు, టీ జనార్దన్ రావు, ఎం సీతారామిరెడ్డి, జె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.