Home ప్రకాశం సిపిఎస్ రద్దు విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలి : యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి...

సిపిఎస్ రద్దు విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలి : యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జానీబాషా, ఎయిడెడ్ కన్వీనర్ కె వీరాంజనేయులు

304
0

చీరాల : ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్ఏఆర్ఆర్ యం ఎయిడెడ్ హై స్కూల్, ఎన్ఆర్అండ్పిఎం మున్సిపల్ హైస్కూల్, కేజీఎం గర్ల్స్ హై స్కూల్ పాఠశాలలను యుటిఎఫ్ నాయకులు సందర్శించి పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ఉపాధ్యాయులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పోస్ట్ కార్డ్ వ్రాయించి వాటిని ముఖ్యమంత్రికి పంపే కార్యక్రమం చేపట్టారు.

అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని, మెరుగైన పిఆర్సి ఇస్తానని, బకాయి ఉన్న వాళ్లకు చెల్లిస్తామని హామీ ఇచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులకు హామీ ఇచ్చి 9నెలలు కావస్తున్నా పట్టించుకోకపోవడం సరికాదని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జానీబాష పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఈ నెల మూడో తేదీన మహా ర్యాలి, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఉపాధ్యాయులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని ఎయిడెడ్ కన్వీనర్ కె వీరాంజనేయులు కోరారు. ఉద్యోగుల ఫ్రండ్లీ ప్రభుత్వంగా ఉంటామని హామీ ఇచ్చిన ఈ ప్రభుత్వం నేటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను, అసంతృప్తిని కలిగిస్తుందని జిల్లా కౌన్సిలర్ సురేష్ తెలిపారు. ఎంతటి పోరాటానికైనా వెనకాడబోమని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు పరిచే వరకు ఉద్యమం కొనసాగిస్తామని పట్టణ అధ్యక్షులు ఎస్ వి సుబ్బారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆలూరి వెంకటేశ్వరరావు, టీ కృష్ణమోహన్, వెంకటేశ్వర బాబు, కే సుబ్బారావు, సిహెచ్ సుబ్బారెడ్డి, జయచంద్రబాబు, వి విజయలక్ష్మి, కె హైమావతి, సిహెచ్ హైమవతి, పార్వతి, పద్మావతి, సరితా, శైలజ, జ్యోతి, రాణి, బాలశంకర్, జిజే రామాంజనేయలు, సుబ్బయ్య, కృష్ణారెడ్డి, సీతారామిరెడ్డి, ఇ దయాసాగర్, జగన్నాథచార్యులు, బండారు నాగేశ్వరరావు, వి మల్లికార్జునరావు, జి రామిరెడ్డి, టి నాగేశ్వరరావు, సుధావాణి ఉపాధ్యాయులు, యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.