చీరాల : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) చీరాల పట్టణశాఖ డైరీ, క్యాలెండర్ ను స్థానిక పురపాలకసంఘ కమీషనర్ పి ఏసయ్య ఆవిష్కరణ చేశారు.
కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లాకార్యదర్శి షేక్ జానిబాషా, రాష్ట్ర ఎయిడెడ్ కన్వీనర్ కె వీరాంజనేయులు, జిల్లా కౌన్సిలర్ పి సురేష్, అధ్యక్ష కార్యదర్శులు ఎస్వీ సుబ్బారెడ్డి, కుర్రా శ్రీనివాసరావు, సహాధ్యక్షులు ఎన్ రాజేష్, కోశాధికారి వెలుగొండారెడ్డి, మండల శాఖ నాయకులు మల్లెల రవి, ఎమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మండలశాఖ డైరీ, క్యాలెండర్ ను మండల విద్యాశాఖాధికారి డి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. మండలశాఖ అధ్యక్షుడు బాలచంద్రరావు, షేక్ మహమ్మద్ ఖాసీం, నాగమల్లేశ్వరరావు, బి క్షాలుబాబు, ప్రభాకర్, హేమంత్ కుమార్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.