Home ప్రకాశం డిఏ, పిఆర్సి విడుదల చేయాలని కోరుతూ ఉపాధ్యాయుల నిరసన

డిఏ, పిఆర్సి విడుదల చేయాలని కోరుతూ ఉపాధ్యాయుల నిరసన

337
0

చీరాల : డిఏ, పిఆర్సి, రెండు నెలల సగం జీతం, పెండింగ్ బిల్లుల చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. చీరాల పట్టణ శాఖ పరిధిలోని పురపాలక ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలులోని ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. తాలూకా, పట్టణ కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల్లో ఒక రత్నంగా ఉద్యోగుల సంక్షేమమని తెలిపిన ముఖ్యమంత్రి నేడు ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ పిఆర్సి ప్రకటించకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ముఖ్యమంత్రి తన హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరారు. సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ జానీ బాషా, జిల్లా కౌన్సిలర్ పి సురేష్, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎస్ వి సుబ్బారెడ్డి, కుర్ర శ్రీనివాసరావు, ఎన్ రాజేష్, సిహెచ్ వెలుగొండ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

తహసిల్దార్ కార్యాలయం వద్ద బుధవారం చేపడుతున్న నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు జి సూరిబాబు, షేక్ జానీ భాష, జిల్లా కమిటీ సభ్యులు, ఎడిట్ కన్వీనర్ కె వీరాంజనేయులు, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ హైమ రావు కోరారు.