బాపట్ల (Bapatla) : జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 7443 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ శుక్రవారం తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నేటి నుండి రాబోయే 21 రోజులకు 7443 మెట్రిక్ టన్నుల యూరియా ఉదన్నారు. పిఎసిఎస్‌లలో 1345 మెట్రిక్ టన్నులు, రైతు సేవ కేంద్రాల్లో 705 మెట్రిక్ టన్నులు, జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీలలో 136 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ రిటైల్ వ్యాపారుల దగ్గర 2300 మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్ గోదాములలో 2947 మెట్రిక్ టన్నులు, టోకు వ్యాపారుల దగ్గర 184 మెట్రిక్ టన్నులు, కంపెనీ గోదాములలో 129 మెట్రిక్ టన్నుల యూరియా, ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 45 కిలోల యూరియా బస్తా రూ.266.50 కు మించి విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






