తిరుమల : శ్రీ వెంకటేశ్వర స్వామికి తరతమ బేధాల్లేవు. ఆ దేవదేవుడు అందరివాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నగరిలోని ఏపీఐఐసీ చైర్మన్ రోజా నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. టీటీడీలో చేపడుతున్న సంస్కరణల గురించి సుబ్బారెడ్డి వివరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలుగు ప్రజలకు ఎల్లెడలా ఉంటాయని సుబ్బారెడ్డి అన్నారు. స్వామి వారి సేవల గురించి కొద్దిసేపు ఇరువురూ చర్చించారు. సుబ్బారెడ్డితోపాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.