Home బాపట్ల రోటరీ ఆధ్వర్యంలో సమైక్యత ర్యాలి

రోటరీ ఆధ్వర్యంలో సమైక్యత ర్యాలి

88
0

చీరాల : స్థానిక ఎన్‌ఆర్‌ అండ్‌ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భారత వీర జవాన్లుకు సంఘీభావంగా సమైక్యతా ర్యాలీ మునిసిపల్ ఆఫీసు, బస్టాండ్ సెంటర్, గడియార స్తంభం సెంటర్, ముంతావారి సెంటర్ మీదుగా రోటరీ క్లబ్ వరకు ఆదివారం నిర్వహించారు. జవాన్ మురళీ నాయక్, వందే మాతరం, ఉగ్రవాదం నశించాలి, భారత్ ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, సిహెచ్‌ బాల వెంకటేశ్వరరావు, చారగుళ్ళ గురు ప్రసాద్, నక్కల సురేష్ బాబు, వలివేటి మురళీకృష్ణ, గ్రంధి నారాయణమూర్తి, డివి సురేష్, గుర్రం రాఘవరావు, బదిరి ,రమేష్, పూర్ణా, వాకింగ్ పాల్గొన్నారు.