Home బాపట్ల పాలకేంద్రాల ఆకస్మిక తనిఖీలు

పాలకేంద్రాల ఆకస్మిక తనిఖీలు

15
0

చీరాల (DN5 NEWS) : పట్టణంలో ఆహార తనిఖీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో పలువురు మృత్యువాత పడిన కారణంగా అధికారులు అప్రమత్తం అయ్యారు. పాల కేంద్రాలు, డైరీల్లో తనిఖీలు చేశారు. ఐదు పాల కేంద్రాల నుండి పాల నమూనాలు సేకరించారు. సేకరించిన నమూనాలు పరిశీలన నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపిస్తున్నట్లు బాపట్ల జిల్లా ఆహార తనిఖీ అధికారి ప్రణీత్ తెలిపారు. పాలలో ఏమైన రసాయనాలు కలిపారా? కల్తీ జరిగిందా? అనే కోణంలో పరీక్షలు చేసి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. లోపాలు ఏమైన బయటపడితే సంబంధిత డైరీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు నాణ్యమైన పాలు వినియోగించాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే ఆహార తనిఖీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.