Home బాపట్ల జాతీయ రహదారిలో రెండు రోడ్డు ప్రమాదాలు

జాతీయ రహదారిలో రెండు రోడ్డు ప్రమాదాలు

12
0
Oplus_16908288

చీరాల (DN5 News) : వాడరేవు, పిడుగురాళ్ల జాతీయ రహదారిలో కారంచేడు సమీపంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని మిగిల్చాయి. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరికొందరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మొదటి ఘటనలో కారంచేడుకు చెందిన కొర్రపాటి వెంకటేశ్వరరావు (46) ద్విచక్ర వాహనంపై కారంచేడు నుండి కొత్త బైపాస్‌లో చీరాల వైపు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఒక్కసారిగా ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

అదే సమయంలో మొదటి ప్రమాద స్థలం నుండి 50 మీటర్ల దూరంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. వినుకొండ నుంచి వాడరేవులోని ఓ రిసార్టులో జరుగనున్న ఫంక్షన్‌కు డీజే స్పీకర్ బాక్స్‌లు, సెట్టింగులతో ప్రయాణిస్తున్న బొలేరో వాహనం పంగులూరు మండలం రామకూరుకు చెందిన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న అప్పి ఆటోను ఢీకొట్టింది. రంజాన్ పండుగ ముగిసిన సందర్భంగా సముద్ర స్నానానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో ఆటో డ్రైవర్ షేక్ కాలేషావలి, అతని భార్య హయ్యద్‌బీతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఏరియా వైద్యశాలకు తరలించారు.

హయ్యద్‌బి పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ వైద్యాశాలలో మృతి చెందింది. రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న కారంచేడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుల నుండి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాడరేవు జాతీయ రహదారిలో వెంట వెంటనే జరిగినా రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందటం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది.