నిజామాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లెడలా ఉంటాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లిలో ఇందూరు తిరుమల శ్రీ పద్మావతి కల్యాణ మండపం ప్రారంభోత్సవానికి విశిష్ట అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వైవీ మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీనివాసుడి చల్లని దీవెనలు తెలుగు ప్రజలందరికి అందించాలనే ఉద్దేశంతో సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో టీటీడీ కృషి చేస్తుందని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలు సోదర భావంతో అభివృద్ధి చెందాలని సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. తిరుమలలో సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న సంస్కరణలను వివరించారు. తెలంగాణా నుంచి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రెండు రాష్ట్రాల్లో ఇలా పల్లెల్లో సైతం పద్మావతి కల్యాణ మండపాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి, పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Home ఆధ్యాత్మికం తెలుగు ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లెడలా ఉంటాయి : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి