ఒంగోలు : మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కోర్ కమిటీలో ముఖ్యుడైన వైవి సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ గా సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారిక ఉత్వర్వులు ఈ రోజు, రేపట్లో వెలువడే అవకాశం ఉంది. 2014లో ఒంగోలు లోక్ సభ నుంచి గెలుపొందిన ఆయన 2019లో పార్టీ అవసరాల దృష్ట్యా పోటీ చేయలేకపోయారు. తన సిట్టింగ్ సీటును మాగుంట శ్రీనివాసరెడ్డికి కేటాయించారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరించారు. సీఎం జగన్ కు అన్ని విధాలుగా అండగా ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాల ఇన్ చార్జిగా కూడా పనిచేశారు. వివాద రహితునిగా పేరొందిన ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇపుడు కేబినెట్ హోదా కలిగిన టిటిడి చైర్మన్ పోస్ట్ ఇవ్వటానికే సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.