అమరావతి : టిటిడి బోర్డు సభ్యులను ప్రభుత్వం ప్రకటించింది. టిటిడి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డిని నియమించిన ముఖ్యమంత్రి జగన్ మంగళవారం మిగిలిన సభ్యుల పేర్లు ప్రకటించారు. బోర్డు సభ్యుల సంఖ్యను 25 నుంచి 28కి పెంచుతూ గతంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఖ్యకు తగ్గట్లుగా సభ్యుల పేర్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఏడుగురికి అవకాశం ఇవ్వడం గమనార్హం.
ఏపీ నుంచి ఎనిమిది మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి టీటీడీ బోర్డులో చోటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణ నుండి రామేశ్వరరావు, బి పార్థసారథిరెడ్డి, వెంకట భాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి దామోదరరావు, కె శివకుమార్, పుట్టా ప్రతాప్‌రెడ్డి పేర్లను ఖరారు చేసింది.
ఏపీ నుండి గొల్ల బాబూరావు, నాదెండ్ల సుబ్బారావు, ప్రశాంతి, యూవీ రమణమూర్తి, మల్లికార్జునరెడ్డి, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాద్‌కుమార్, పార్థసారథి పేర్లను ప్రకటించింది. ఢిల్లీ నుండి శివశంకరన్, మహరాష్ట్ర నుండి రాజేష్ శర్మ, కర్ణాటక నుండి రమేష్‌శెట్టి, రవినారాయణ, సుధా నారాయణమూర్తి, తమిళనాడు నుండి వైద్యనాథన్, శ్రీనివాసన్, డా.నిశ్చిత, కుమారగురు పేర్లను ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో ప్రకటించిన పేర్లను పరిశీలిస్తే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కొందరికి టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.