Home బాపట్ల త్రో బాల్ పోటీలో యాజలి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

త్రో బాల్ పోటీలో యాజలి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

73
0

బాపట్ల : నియోజకవర్గంలోని యాజలి ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి జూనియర్‌ త్రో బాల్‌ పోటీల్లో ప్రతిభ చూపే విధంగా విద్యార్థులను పాఠశాల పిడి ఎం మెర్సి తీర్చి దిద్దారు. విద్యార్థుల నైపుణ్యాన్ని గమనించి శిక్షణ ఇచ్చారు. పాండిచ్చేరిలో జరిగిన జూనియర్ నేషనల్ త్రో బాల్ ఛాంపియన్షిప్‌కు నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో కె సింధూర, ఎ హాసిని, ఎ రాహులి, సిహెచ్ అక్షయని జాతీయ పోటీల్లో ప్రతిభ చూపటం పట్ల విద్యార్ధులతోపాటు శిక్షణ ఇచ్చిన పీడీని పాఠశాల హెచ్ఎం కె శ్రీనివాసరావు, డి సుభాషిణి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.