త్రిపురాంతకం : త్రిపురాంతకంలో వెలసిన త్రిపురాంతకేశ్వర, శ్రీబాల త్రిపురసుందరి దేవి అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా, సహస్త్ర దీపాలంకరణ, జ్యోతి తోరణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సుబ్బారావు, ఆలయ రమేష్, భక్తులు విరివిగా పాల్గొని విశేష పూజలు చేశారు.