Home ప్రకాశం రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు1000 మస్కులు అందజేత

రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు1000 మస్కులు అందజేత

378
0

చీరాల : కారొన లాక్ డౌన్ సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉండేందుకు రోటరీ క్లబ్ క్షీరపురి వ్యవస్థాపక అధ్యక్షుడు అడ్డగడ్డ మల్లికార్జున్, చిరుమామిళ్ల రమేష్ కుమార్, సుప్రియ సహకారంతో రూ.15వేల విలువైన త్రీ లేయర్స్ 1000మాస్కులను మున్సిపల్ కమిషనర్ కే రామచంద్రారెడ్డికి అందజేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆపత్కాల సమయంలో దాతల సహాయం ఎంతో విలువైందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండి అధికారులకు, పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ప్రెసిడెంట్ రావి వెంకటరమణారావు, సెక్రటరీ, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు, మున్సిపాలిటీ సిబ్బంది మారుతీరావు, శ్రీనివాసరావు, శ్యముల్ పాల్గొన్నారు.