Home బాపట్ల ఎంపిడిఒపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

ఎంపిడిఒపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

26
0

కొల్లూరు (బాపట్ల జిల్లా) : అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపిడిఒ దళితుడైన జవహర్ బాబుపై దాడి చేసిన సుదర్శన్‌రెడ్డి, గడ్డం చంద్రప్రకాష్‌రెడ్డి, జెసిపి రమణారెడ్డి, గరుగుపల్లి రామాజున్‌రెడ్డి, వెంకటరెడ్డి, బానుమూర్తిరెడ్డి, ధర్మారెడ్డి, ప్రభాకర్‌లపై విచారణ జరిపి అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు, కొల్లూరు మండలం తోకలవారిపాలెం సర్పంచి టి కృష్ణమోహన్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పంచాయతీ రాజ్ ఉద్యోగస్తుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉండగా ఆఫీసుకు తాళాలు వేయడమే కాకుండా దాడి చేసి గాయపర్చడం అత్యంత పాశవిక చర్య అన్నారు. అధికారుల పనులు నచ్చకపోయినా, ఇబ్బందులు ఉన్నా ఉన్నతాధికారులకు పిర్యాదు చేయవచ్చని అన్నారు. దాడులు చెయ్యడం సిగ్గు చేటు అన్నారు. పంచాయతీ రాజ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించడం మంచి విషయం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత, గిరిజనులపై దాడులు వీపరీతంగా పెరిగాయని, వీటిపై స్పందించి సమీక్షించాలని కోరారు. ముఖ్యమంత్రి స్థాయిలో దళిత అధికారులు, దళితులు గిరిజనులపై జరుగుతున్న దాడులపై సమీక్షించి ప్రజలకు భరోసా కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు.