• నడవలేని, అనరోగ్యంతో ఉన్న వాళ్లు రావొద్దు
• ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ తప్పనిసరి
• కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్
బాపట్ల (DN5 News) : నడవలేని, మంచాలకు పరిమితం అయ్యి, అనారోగ్యంతో బాధపడుతున్న వారెవ్వరినీ పిజిఆర్ఎస్‌కు తీసుకురావద్దని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పిజిఆర్ఎస్‌లో ప్రజలు సమస్యలపై అర్జీలను ఉదయం 10 నుండి 1 గంట వరకు అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు.
పిజిఆర్ఎస్‌లో సమస్యల అర్జీలు అందజేసేందుకు అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని వారిని, మంచాలకు పరిమితమైన వారిని ఎవ్వరూ పిజిఆర్ఎస్‌కు తీసుకురావద్దని, అలాంటి వారికి సంబంధించిన సమస్యలు ఉంటే వారి తరుపున వారు వచ్చి అర్జీలు అందజేయవచ్చని అన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి కలెక్టరేట్‌కు వచ్చే వాళ్లు ద్విచక్ర వాహనంపై తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకొని రావాలని అన్నారు. కలెక్టరేట్ తోపాటుగా ప్రతి రెవెన్యూ డివిజన్‌లో తహశీల్దార్లు కార్యాలయాలలోను తహశీల్దార్లు, ఎంపిడిఓలు ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.






