చీరాల (Chirala) : పట్టణంలో చోరీ ఘటన కలకలం రేపింది. మంగళవారం అర్థ రాత్రి పువ్వాడవారి వీధిలో అసోసియేషన్ బిల్డింగ్ సమీపంలో నివాసం ఉంటున్న ప్రవేటు కళాశాల కరస్పాండెంట్ మువ్వల ప్రసాదరావు ఇంటిలో చోరీ జరిగింది. దంపతులు ఉడ్ నగర్ లోని రమేష్ హాస్పటల్ కు (Ramesh Hospital) అనారోగ్య నిమిత్తం వైద్యం కోసం వెళ్ళి వచ్చేలోపు దుండగులు ఇంట్లోని వెనుక తలుపు నుంచి లోపలికి వెళ్లి చోరీకి పాల్పడ్డారు. కబోర్డులో దాచిన 117 సవర్లు బంగారు ఆభరణాలు, రూ.1.60 లక్షల నగదు అపహరించారు. దుండగులు చోరీ చేసిన చోట ఎలాంటి ఆనవాలు లభించకుండా ఉండేందుకు సినీపక్కీలో కారం చల్లి వెళ్ళిపోయారు. జరిగిన ఘటనపై బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు బుధవారం క్లూస్ టీంను రంగంలోకి దించారు. ఒకటో పట్టణ ఎస్‌ఐ రాజ్యలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాస్పటల్‌కు వెళ్లి వచ్చే గంట వ్యవధిలో చోరీ జరగటం ఆపై ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోరీ ఘటన వద్ద కారంపొడి చల్లటంతో తెలిసిన వారి పనేననే కోణంలో విచారణ చేశారు. ముద్దాయిలను గంటల వ్యవదిలో పట్టుకుని నగదు, బంగారం పోలీసులు (Police) స్వాదీనం చేసుకున్నట్లు తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.