Home బాపట్ల ప్రధమ చికిత్సలో పీఎంపీలు సేవలు అభినందనీయం

ప్రధమ చికిత్సలో పీఎంపీలు సేవలు అభినందనీయం

17
0

చీరాల (DN5 News) : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో చీరాల, రేపల్లె డివిజన్ పరిధిలోని పి.యం.పి. లకు ప్రధమ చికిత్స శిక్షణ నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చీరాల పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ వైద్య రంగంలో వచ్చిన కీలక మార్పుల నేపథ్యంలో ప్రైమరి మెడికల్ ప్రాక్టీషనర్స్ కు మరింత అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చీరాల సబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ శ్రీ బూదరాజు శశి కిరణ్ మాట్లాడుతూ సేవారంగంలో రెడ్ క్రాస్ కు ప్రత్యేక స్థానం వున్నదని, పేద ప్రజానీకానికి మరింత సరైన వైద్య సేవలు సకాలంలో అందించే కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధమ చికిత్స అందించడంలో ప్రైమరి మెడికల్ ప్రాక్టీషనర్స్ పాత్ర గణనీయమైనదన్నారు.

రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు మాట్లాడుతూ ఈ శిక్షణ పొందాతద్వారా ఎంతో విలువైన సర్టిఫికెట్ లు పొందటం ద్వారా పిఎంపిలు వారి సేవలను మరింత విస్తృతము చేయాలన్నారు. ఈ సందర్బంగా శిక్షణ పొందిన 105 మంది పిఎంపిలకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఐ బాబురావు, రెడ్ క్రాస్ చైర్మన్ శశి కిరణ్ సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ జానీ రసూల్, రెడ్ క్రాస్ జిల్లా వైఆర్ సి కో ఆర్డినేటర్ శ్రీమన్నారాయణ, పిఎంపి అసోసియేషన్ చీరాల, రేపల్లె అధ్యక్షులు టి సాంబశివరావు, ఆర్ రాఘవరావు, కార్యదర్సులు కే సుబ్బారావు, యు. వీరాంజనేయులు, కోశాధికారి గోలి శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ కార్యదర్శి జిఎవి ప్రసాద్, మేనేజింగ్ కమిటీ సభ్యుడు పసుపుల వందనం, సూరంపల్లి పవన్ కుమార్, నారాయణం వెంకటేష్ పాల్గొన్నారు.