Home బాపట్ల ఆపదలో ఉన్న వారిని ఆదుకోటం రెడ్‌క్రాస్ లక్ష్యం

ఆపదలో ఉన్న వారిని ఆదుకోటం రెడ్‌క్రాస్ లక్ష్యం

5
0

చీరాల (DN5 News) : ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటమే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లక్ష్యమని కర్లపాలెం రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు. పట్టణంలోని కుందేరు సమీపంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన ఐదు పేద కుటుంబాలకు కర్లపాలెం రెడ్ క్రాస్ తరఫున బొంత శామ్యూల్ త్యాగరాజ్ సహకారంతో బాధితులకు బట్టలు, నిత్యవసర సరుకులు శనివారం అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చీరాల సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ప్రతినిధులు మాట్లాడుతూ వీధుల్లో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించె పేదల గుడారాలు కాలిపోవడంతో స్పందించి సహాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చీరాల బ్రాంచ్ చైర్మన్ బూదరాజు శశి కిరణ్, కర్లపాలెం చైర్మన్ పోలీసురావు, ఉపాధ్యక్షురాలు సూరంపల్లి తేజస్వి, కార్యదర్శి ఎవిఎస్‌ ప్రసాదు, ఎంసి సభ్యులు అబ్దుల్, పూర్ణ చంద్రరావు, తడవర్తి చంద్ర, పవన్ కుమార్, డిబిఆర్‌సి కోఆర్డినేటర్‌ భగవాన్ దాస్ పాల్గొన్నారు