Home బాపట్ల పెంచలయ్య హంతకులను శిక్షించాలి

పెంచలయ్య హంతకులను శిక్షించాలి

11
0

వేమూరు (Vemuru) : భట్టిప్రోలు పంచాయితీ అద్దేపల్లి అంబేద్కర్ (BRAmbedkar)విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు (CITU) జిల్లా కార్యదర్శి పి మనోజ్ కుమార్, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురుగుడు సత్యనారాయణ మాట్లాడారు. డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన ప్రజా నాట్య మండలి కళాకారుడు, సిపిఎం (CPM) యువజన నాయకుడు పెంచలయ్యను హత్య చేసిన గంజాయి ముఠాను కఠినంగా శిక్షించాలని కోరారు. అరెస్టు చేయడానికి వెళ్ళిన పోలీసులపై కూడా దాడి చేయడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా గంజాయి, మాదక ద్రవ్యాలు విస్తరించాయని అన్నారు. మత్తు పదార్థాలపై గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. గంజాయి మాఫియా పట్ల ప్రభుత్వం, పోలీసులు ఎక్కడ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు గంజాయి మాఫియాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సిపిఎం నేత పెంచలయ్య కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు అహరోను, వినోద్, ఆనంద్, రాజేష్, అఖిల్, వాసు, భాస్కర్ పాల్గొన్నారు.