ఎపి పాలిటిక్స్ (AP Politics) : రైల్వే కోడూరు నియోజకవర్గంలో టిడిపి టికెట్ కోసం వేమన సతీష్‌కు రూ.7 కోట్లు ఇచ్చానని సుధా మాధవి చెబుతున్న వీడియో ఇప్పుడు గంటల వ్యవధిలో ఎక్స్ వేదికగా వైరలైంది. డబ్బులు తీసుకుని సతీష్ మోసం చేశాడని ఆరోపించారు. తనపై కేసులు పెడతానని బెదిరిస్తున్నాడని చెప్పారు. సీఎం చంద్రబాబు తనకు న్యాయం చేయాలని కోరుతూ Amigo9666 ఎక్స్ ఖాతా నుండి ‘ఇలాంటివి ABN, TV5 ప్రచారం చేయరా?’ అని ట్యాగ్ చేసిన పోస్టు వైరలైంది. ఆమె మాటలతోపాటు అప్పట్లో డబ్బు ఇస్తున్న వీడియో కూడా ట్యాగ్ చేసి పోస్టు చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.7కోట్లు ఇచ్చాము. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లినప్పుడు, ఆ 53రోజులు నియోజకవర్గంలో రీలే నిరాహారదీక్షలు చేశాను. అయిన ఫలితం దక్కలేదు. నాకు #Chandrababu తెలుసు, #Lokesh తెలుసు అని ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను అని రూ.7 కోట్లు తీసుకొని వేమన సతీష్ అనే #TDP నేత మోసం చేశాడని ఆ పార్టీ మహిళ నేత ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును కలవడానికి ప్రయత్నిస్తుంటే చంపేస్తాం అని బెదిరిస్తున్నారు. నాకు చంద్రబాబు గారే న్యాయం చేయాలని మహిళ నేత వేడుకుంటున్నారు. – సుధా మాధవి
https://x.com/ChotaNewsApp/status/1987105040793022674?s=20
https://x.com/Amigo9666/status/1987173374137934319?s=20
https://x.com/greatandhranews/status/1987152233314877536?s=20






