Home బాపట్ల మొక్కజొన్న ప్రభుత్వమే కొనుగోలు చేయాలి : రైతు సంఘం జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు

మొక్కజొన్న ప్రభుత్వమే కొనుగోలు చేయాలి : రైతు సంఘం జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు

7
0
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; module: photo; hw-remosaic: false; touch: (-1.0, -1.0); modeInfo: ; sceneMode: 8; cct_value: 0; AI_Scene: (11, 0); aec_lux: 476.74036; aec_lux_index: 0; hist255: 0.0; hist252~255: 0.0; hist0~15: 0.0; albedo: ; confidence: ; motionLevel: -1; weatherinfo: null; temperature: 41;

పంగులూరు (DN5 News) : మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు కోరారు. మండలంలోని కొండమూరులో మొక్క జొన్న రైతులతో ఆయన మాట్లాడారు. మిర్చి, పొగాకు పంటల్లో నష్టపోతున్న రైతాంగం ఈ ఏడాది విపరీతంగా మొక్కజొన్న పంట సాగు చేశారని అన్నారు. వాతావరణం అనుకూలించి మొక్కజొన్న పంట బాగా పండుతుందని రైతులు ఆశిస్తున్నారని చెప్పారు. రైతుల ఆశలు నెరవేర్చే దిశగా మొక్కజొన్న ధరలు లేవని అన్నారు.

ప్రభుత్వం మద్దతు ధర రూ.2400గా ప్రకటించిన ఇంతవరకు కొనుగోలు చేయకపోవడంతో ప్రవేటు వ్యాపారులు రూ.1500కే అడుగుతున్నారని అన్నారు. ఈ రేటుకు అమ్ముకుంటే నష్టాలే మిగులుతాయని అన్నారు. కౌలు రైతులకైతే భారీగా నష్టాలు వస్తాయని చెప్పారు. అందుకని ఈ ఏడాది మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

అమెరికా నుండి మొక్కజొన్న తక్కువ ధరకు దిగుమతి కాబోతున్నాయనే సాకు చెప్పి రైతుల దగ్గర తక్కువ ధరకే కొట్టేయాలని ప్రవేట్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రవేటు వ్యాపారుల చేతిలో రైతులు చిక్కకముందే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న రైతులను కాపాడుకునేందుకు ఈ నెల 26న పంగులూరులో జరగనున్న మొక్కజొన్న సదస్సులో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తలపనేని స్వామి పాల్గొన్నారు.