Home బాపట్ల తీరంలో పర్యాటకుల సందడి

తీరంలో పర్యాటకుల సందడి

12
0

చీరాల (DN5 News) : రంజాన్ పండగ ముగిసిన సందర్బంగా వాడరేవు సముద్రతీరంలో పర్యాటకుల సందడి నెలకొంది. 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం విశ్రాంతి కోసం ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా తీరప్రాంతాలకు చేరుకున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా సముద్ర స్నానాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. రామాపురం సముద్రతీరం సందర్శకులతో కళకళలాడింది. చల్లని సముద్ర గాలి, అలల సోయగం సందర్శకులను ఆకట్టుకుంది. పిల్లలు అలలతో ఆడుకుంటూ సందడి చేశారు.

పెద్దలు కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడిపారు. గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, పర్చూరు తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తీర ప్రాంతాన్ని కిక్కిరిసేలా చేశారు. భద్రత దృష్ట్యా పోలీసులు తీరప్రాంతంలో ప్రత్యేక పహారా నిర్వహించారు. పడవలపై గస్తీ కాస్తూ సముద్ర స్నానాలకు దిగిన వారిని అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు సూచించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.