Home ప్రకాశం ఆమంచికి థాన్క్స్ : న్యాయవాది వైకే

ఆమంచికి థాన్క్స్ : న్యాయవాది వైకే

469
0

చీరాల :  సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ నాయుడు నాగార్జునరెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఓరుగంటి రెడ్డి రిసర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్క్ వద్ద శనివారం బహిరంగ సభను నిర్వహించారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది వై.కె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఉన్న వాక్ స్వాతంత్రం చీరాలలో లేదని అన్నారు. ఇక్కడ ఏక పక్షంగా పాలన సాగుతోందని ఆరోపించారు. ఆక్రమంగా, అన్యాయంగా నాయుడు నాగార్జునరెడ్డి మీద దాడి చేయటం హేయమైన చర్యని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు బలహీన పడటం వల్లనే ఇలాంటి ఘటనలు చూడాల్సి వస్తుందని అన్నారు. అధికారులు, పోలీస్ వ్యవస్థ అధికారంలో ఉండి మేనేజ్ చేయగలిగిన వారి కనుసన్నుల్లో పనిచేయడం కారణంగానే నేరం చేసేవారికి అడ్డులేకుండా పోయిందన్నారు. అమాయకుల మీద, విలేకరుల మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. తనపై హత్యాయత్నం జరుగుతుందని ముందుగా పోలీసులకు చెప్పుకున్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. నాయుడు నాగార్జునరెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని, వారికి న్యాయం చేయాలని కోరారు.

నాగార్జున రెడ్డిపై జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో వచ్చిన సానుభూతితో ఎమ్మెల్యే అయినా ఆశ్చర్యం లేదని, ఇంతటి సానిభూతికి కారణమైన ఆమంచికి థాంక్స్ చెబుతున్నట్లు న్యాయవాది వై కొటేశ్వరరావు (వైకే) అన్నారు.