పర్చూరు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల సేవలో కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి చిన్నగంజాం మండలం పెద్దగంజాం పంచాయతీ పరిధిలోని కొత్త గొల్లపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం కావడంపట్ల శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ పెన్షన్ల పంపిణీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిపై ప్రత్యేక శ్రద్ధ చూపి నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రిగా తొలిసారి పర్చూరు నియోజకవర్గంలో చంద్రన్న పర్యటనను క్రమశిక్షణతో విజయవంతం చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. పి4 కార్యక్రమంలో భాగంగా అధినేత పిలుపుతో కదలి వచ్చిన బంగారు కుటుంబం, మార్గదర్శలకు, పర్యటనను ఎక్కడా లోటుపాట్లు లేకుండా విజయవంతం చేసిన జిల్లా అధికారులు, పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు.