Home ప్రకాశం చీరాల తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

చీరాల తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

383
0

చీరాల : చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి చీరాల తాసిల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు కార్యకర్తలను ఎవ్వరిని లోపలికి వెళ్లకుండా అనుమతి నిరాకరించారు. ఉదయం నుండి కార్యకర్తలను కార్యాలయంలోనికి వెళ్లకుండా నిలువరించడం, గేట్లు మూసివేయడంతో తాసిల్దార్ కార్యాలయం గేటు వద్ద టిడిపి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే గారు అధికారులతో సమీక్ష జరుపుతున్న సమయంలో కార్యకర్తలు వెళ్లాల్సిన అవసరం లేదంటూ పోలీసులు నిరాకరించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలు వివరించేందుకు తాము వెళ్లాలని కార్యకర్తలు పట్టుబట్టారు. అయినప్పటికీ లోపలికి వెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. కొద్దిసేపు పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ ఎంపీపీ గంటా శ్రీనివాసరావు తమను ఎందుకు అనుమతించరని ప్రశ్నించడంతో పోలీసులను రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడవద్దని సీఐ నాగమల్లేశ్వరరావు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడున్న టిడిపి యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు సిఐని నివారించారు.