తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కైన్సిల్ టెలివిజన్ రంగంలో పనిచేస్తున్న దాదాపు 1800 మంది కళాకారులకు, టెక్నీషియన్లకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా టీవీ ప్రొడ్యూసర్స్ మరియు ఛానల్స్ అందరూ ముందుకు వచ్చి దాదాపుగా రూ.30లక్షలు సేకరించడం జరిగిందని, త్వరలో అందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయబోతున్నామని, టెలివిజన్ రంగంలో ఉన్నఏ కార్మికుడికి ఏ ఆపద వచ్చినా టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అండగా నిలుస్తుందని తెలియజేడానికి గర్వపడుతున్నామని టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ప్రసాద రావు, సెక్రటరీ వినోద్ బాల, జాయింట్ సెక్రటరీస్ మన చౌదరి, కిరణ్, ట్రెజరర్ రమేష్ బాబు తెలిపారు.