Home బాపట్ల తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వాలి

తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వాలి

13
0

చీరాల (Chirala) : స్థానిక ఎన్‌ఆర్‌ అండ్‌ పిఎం ఉన్నత పాఠశాల వాకర్స్ అసోసియేషన్ (Walkers) ఆధ్వర్యంలో 26వ అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘం ఆవరణలోని తెలుగు తల్లి విగ్రహానికి పూల మాల సమర్పించారు. తూర్పు పాకిస్తాన్‌లో 1952 ఫిబ్రవరి 21న జరిగిన బెంగాలీ భాష పరిరక్షణ ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో అమరవీరులైన డాకా విశ్వ విద్యాలయానికి చెందిన 5గురు విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ప్రభుత్వం మాతృ భాష తెలుగుకు ప్రాచీన బాష గుర్తింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్ని తెలుగులో జరగాలని కోరారు. కార్యక్రమంలో వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, సెక్రటరీ చారగుళ్ళ గురుప్రసాద్, గొడవర్తి సుధాకరరావు, అమరా వీరాంజనేయులు, నారాయణమూర్తి, తుకారాం, రవి, రామబ్రహ్మం, మధుసూదనరావు, రామారావు, నరసింహరావు, బుల్లిబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.