Home సినిమా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ చైర్మన్ రాఘవేంద్రరావు

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ చైర్మన్ రాఘవేంద్రరావు

296
0

హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర దర్శకుల దినోత్సవం మే4న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలుగు చలన చిత్ర దర్శకుల సంక్షేమం కోసం ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకుందామని తీర్మానించారు. తద్వారా సంఘ సభ్యులలో ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నవారికి ఆరోగ్య, విద్య, కుటుంబ అవసరాలకి సహాయం చేసే విధంగా ఒక నిధిని ఏర్పాటు చేసుకుని, తద్వారా వచ్చే వడ్డీతో అర్హులైన వారికి తోడ్పాటు ఇద్దామని చెప్పారు. ముందుగా దర్శకులు రాజమౌళి రూ.50లక్షలు భూరి విరాళం అందించారు. రాఘవేంద్రరావు రూ.10లక్షలు, అర్క మీడియా రు.15లక్షలు విరాళం ప్రకటించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగా స్టార్ చిరంజీవి ట్రస్ట్

ఆలోచనని మెచ్చి పెద్ద హృదయంతో రూ.25లక్షలు ప్రకటించారు.

ప్రస్తుత దర్శకుల సంఘ ప్యానెల్ సత్సంకల్పం, మిగతా అందరి దర్శకుల సహాయ, సహకారాలతో ఈ నెల 24న ట్రస్ట్ ని రిజిస్టర్ చేశారు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ పేరిట రాఘవేంద్రరావు చైర్మన్ గా, ఎన్ శంకర్ మేనేజింగ్ ట్రస్టీగా, వివి వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, మెహెర్ రమేష్ (ట్రేసరర్), కొరటాల శివ, నందిని రెడ్డి, రాంప్ర‌సాద్‌, కాశీ, బివిఎస్‌ ర‌వి ట్రస్టీలుగా టీఎఫ్డిటి ఆవిర్భావించింది.

విరాళాల సేకరణ, సహాయనిధిని త్రికరణ శుద్ధిగా సభ్యుల అత్యవసర అవసరాలకి అందించే విధంగా టీఎఫ్డిటిని ముందుకు తీసుకు వెళ్లాలనే ధృడ సంకల్పంతో ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. టీఎఫ్డిటికి మరింత మెరుగైన భవనం, లైబ్రరీ, ఫంక్షన్ హాల్, దర్సకత్వ శాఖలో ప్రావీణ్య తరగతులు, ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడానికి తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు కోరుకుంటుంది. ఈ సందర్భంగా కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.