చీరాల : కారంచేడు దళిత బాధిత పోరాట కమిటీ కన్వీనర్ తేళ్ల జడ్సన్ కు కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ప్రకాశం జిల్లా కార్యదర్శి బి రఘురాం, చీరాల డివిజన్ కార్యదర్శి లింగం జయరాజ్, యన్ బాబురావు, దళిత ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ వి అమృతపాణి, నీలం నాగేంద్రం, కరవది సుబ్బారావు, మోహన్ కుమార్ ధర్మా, దాసరి శివాజీ, చప్పిడి వెంగళరావు, దారా అంజయ్య, విద్యాసాగర్, అంబేద్కర్, విజయ్ సుందర్ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ కారంచేడులో దళితులను అగ్రకుల పెత్తందార్లు దాడులు చేసి హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని మొదటి నుంచి సుప్రీంకోర్టులో శిక్ష పడేంతవరకు ఐకమత్యంతో పోరాటం చేసిన వ్యక్తి అన్నారు. రాష్ట్రంలో కారంచేడు, చుండూరు ఉద్యమాల స్పూర్తితో దేశంలో దళిత, గిరిజనులకు గుండె కాయ లాంటి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989లో వచ్చిందన్నారు. ఇప్పుడు మన దేశంలో ఉన్న మనువాద మతోన్మాద బిజెపి ప్రభుత్వం ఆ చట్టాన్ని నీరుకారుస్తూ సుప్రీంకోర్టుచే దుర్మార్గమైన తీర్పులు ఇప్పిస్తున్నారు. చట్టాన్ని కాపాడుకునేందుకు మరో పోరాటం చెయడమే తేళ్ల జడ్సన్ కు నిజమైన నివాళి అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.