Home ప్రకాశం ఉపాద్యాయులు జానీబాషాకు ఉత్తమ సేవా పురష్కారం

ఉపాద్యాయులు జానీబాషాకు ఉత్తమ సేవా పురష్కారం

388
0

చీరాల : పురపాలక ప్రాధమిక పాఠశాల యూఎల్బీ కోఆర్డినేటర్ షేక్ జానీబాషా ఉత్తమ సేవా పురష్కారానికి ఎంపికయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతులమీదుగా ఒంగోలులో జరిగిన వేడుకల్లో ప్రశంసా పత్రం అందుకున్నారు. పురపాలక విద్యాశాఖలో అందించిన విశేషమైన సేవలకు గుర్తింపుగా ఉత్తమ సేవా ప్రశంసా పత్రాన్ని జిల్లా కలెక్టరు పోల భాస్కర్, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అందించారు. నిజాయతీ, నిబద్ధతలకు నిదర్శనంగా ఈ గౌరవం దక్కిందని, ఇందుకు ప్రోత్సహించిన మున్సిపల్ కమీషనర్ కె రామచంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన వృత్తిపరమైన జీవితంలో నిత్యం మార్గదర్శకులుగా ఉన్న హైస్కూల్ కోఆర్డినేటర్ పి సురేష్, ప్రతి పనిలో తన వెంట నిలిచిన తోటి ఉపాధ్యాయమిత్రులు ఎస్వీ సుబ్బారెడ్డి, ఎన్ రాజేష్, సయ్యద్ జానీ బాషా, టి జనార్ధనరావులకు, అన్నివిధాల సహకరించిన పురపాలక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. యూటీఎఫ్ సంఘ క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీలు పాటించడం వలననే ఈ గౌరవం దక్కిందని అన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి, పాఠశాల అభివృద్ధికి, విద్యారంగ పురోభివృద్ధికి మరింతగా కృషిచేస్తానని తెలిపారు. కుటుంబసభ్యుల సహకారం మరువలేనిదని గుర్తుచేసుకున్నారు.