పొన్నలూరు : సంగమేశ్వరం ఆలయం వద్ద కొండేపి నియోజకవర్గ టిడిపి నేతలు ఒక్కచోట చేరారు. విబేధాలు పక్కనబెట్టారు. కార్తీక వన భోజనాల్లో కలిశారు. కార్యక్రమంలో కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టిడిపి జిల్లా అధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి,
కందుకూరు, కనిగిరి, సంతనూతలపాడు శాసనసభ్యులు పోతుల రామారావు, కదిరి బాబురావు, బిఎన్ విజయ్ కుమార్, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదెన్న, గ్రంధాలయ చైర్మన్ వైవి సుబ్బారావు, జడ్పీటీసీ ల సంఘం జిల్లా అధ్యక్షులు కంచర్ల శ్రీకాంత్, లీడ్ స్మార్ట్ పౌండేషన్ చైర్మన్,
జిల్లా టిడిపి యువజన నాయకులు దామచర్ల సత్య, టిడిపి సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచందర్రావు, ఏఎంసీ చైర్మన్ కొర్రపాటి రామయ్య చౌదరి, సిద్ధ సుధీర్ బాబు, బెల్లం జయంత్ బాబు, టంగుటూరు, కొండపి, పొన్నలూరు ఎంపీపీలు చదలవాడ చంద్రశేఖర్, జె రత్తమ్మ, మండవ వీర కుమారి, టీడీపీ సీనియర్ నాయకులు కామని విజయ్ కుమార్, నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని కోరారు. అందరూ విభేదాలు పక్కనపెట్టి ఇప్పటి నుండే గెలుపుకోసం కృషి చేయాలన్నారు.