నెల్లూరు : టిడిపికి సంక్షోభాలు కొత్తకాదని, నాయకుల కన్నా కార్యకర్తలే పార్టీ బలమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఎన్నికల పరిశీలకులు గొడుగులు గంగరాజు అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ 30వ డివిజన్ పార్టీ కమిటీ ఎన్నిక సభలో ఆయన మాట్లాడారు.
అధికార పార్టీ నేతలు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కన్నా టిడిపి నేతలు, కార్యకర్తలనే టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడటం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం లో చంద్రబాబు చేసిన అభివృద్ధి ని చెరిపేసే కార్యక్రమంలో భాగంగానే వివాదం చేస్తున్నారని అన్నారు. దీనివల్ల చంద్రబాబు ఎక్కడికీ పోదన్నారు. ప్రజా వేదిక కూల్చి పారిశ్రామిక వేత్తల నమ్మకాన్ని ప్రభుత్వం కోల్పోయి రాష్ట్ర అభివృద్ధిని ప్రమాదంలో పెట్టారన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సందర్భం వచ్చినపుడు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.