గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి ప్రజల్లో గెలిచే అవకాశం లేక దొడ్డిదారిన స్థానిక ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ అండ్ కో పెద్ద ఎత్తున టిడిపి మద్దతుదార్ల ఓట్లను తొలగించే కుట్రలు చేస్తున్నారని గుంటూరు పశ్చిమ టిడిపి ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర (నాని) ఆరోపించారు. స్థానిక లక్ష్మీపురంలోని టిడిపి పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఆయన మీడియాతో గురువారం మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి ఓటు పునాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే సామాన్యుడి పాతుపతాస్త్రం ఓటని అన్నారు. అటువంటి ఓటును తొలగించే హక్కు ఎవరికీ లేదన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి అడ్డా అని, ఇక్కడ ఏ ఒక్క ఓటును తొలగించిన లేదా అక్రమంగా ఓటును చేర్చినా సహించేది లేదని పేర్కొన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన మద్దాళి గిరి హద్దులు దాటొదని హెచ్చరించారు. ఎవరికీ తెలియని మద్దాళి గిరిని రాజకీయంగా ఆదరించి ఎమ్మెల్యేగా చేసిన టిడిపికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మద్దాళి గిరి అని ధ్వజమెత్తారు.