బాపట్ల : టిడిపి మండల విస్తృత స్ధాయి సమావేశం ఆదివారం నక్కల వెంకటస్వామి అద్యక్షతన నిర్వహించారు. ఈసమావేశంలో తెలుగు రైతు జిల్లా అద్యక్షులు రావిపూడి నాగమల్లేశ్వరావు, బాపట్ల రూరల్ అద్యక్షులు కావురి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఎంఎల్సి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో సతీష్‌ను ఎంఎల్ఎగా ఎన్నుకుని నారా చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంమత్రిని చెయ్యాలని అన్నారు. బాపట్ల నియోజకవర్గం రాష్ట్రంలో ప్రధమ స్థానంలో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ పి ఆంజనేయరాజు, జెడ్‌పిటిసి గుంపుల కన్నయ్య, పమిడి బాస్కరరావు, బుల్లెట్ నాగరాజు, మాడా శ్రీను, పసుపులేటి సుబ్బారావు, బెజ్జం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.