Home ప్రకాశం యడం బాలాజీ నేతృత్వంలో టిడిపి బి ఫారాల పంపిణీ

యడం బాలాజీ నేతృత్వంలో టిడిపి బి ఫారాల పంపిణీ

445
0

చీరాల : టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న ఎడం బాలాజీ టిడిపి తరఫున నామినేషన్లు దాఖలు చేసిన స్థానిక సంస్థల అభ్యర్థులకు టిడిపి ఫారాలను తన కార్యాలయంలో పంపిణీ చేశారు. చీరాల మండల జడ్పిటిసి అభ్యర్థిగా బిట్రా సుజాత, వేటపాలెం జడ్పిటిసి గా బట్ట అనంత లక్ష్మి కి టిడిపి బి ఫాం అందజేశారు. అలాగే చీరాల మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేసిన 19మందికి, చీరాల మండలంలో 24ఎంపీటీసీ అభ్యర్థులకు బి ఫారాలు ఇచ్చారు. వేటపాలెం మండలం లోని టీడీపీ అభ్యర్థులకు వివరాలు అందజేశారు. వైయస్సార్ పార్టీలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో బి ఫారాలపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థులు మాత్రం బి ఫారాలు దాఖలు చేసి ఓటర్లను కలవడంలో ముందున్నారు. టిడిపి ఫారాల పంపిణీ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గుద్దంటే చంద్రమౌళి ఉన్నారు.