టంగుటూరు : రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డపై టిడిపి నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. టంగుటూరు వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు మాట్లాడారు. తమిళనాడు ఎల్లావూర్ చెక్ పోస్ట్ వద్ద రూ.5.27కోట్ల నగదును ఆ రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటనతో బాలినేనికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా టీడీపీ నాయకులు దామచర్ల జనార్ధన్ కట్టుకథలు అల్లి మీడియా ద్వారా విష ప్రచారం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. అవాస్తవ కథనాలతో తమిళ మీడియా ప్రసారం చేసిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. లోకేష్ ట్విట్టర్ లో తప్పుడు కథనాలు పెట్టడం అతని అవివేకానికి నిదర్శనమని అన్నారు. మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. బోండా ఉమ, దామచర్ల జనార్ధన్ లకు బాలినేనిని విమర్శించే స్ధాయి, అర్హత లేదన్నారు.
ఒంగోలు బంగారు వ్యాపారి నల్లమల్లి బాబు నగదు తమదేనని, పట్టుబడిన నగదుతో ఏ రాజకీయ నాయకుడికి సంబంధం లేదని విలేకర్ల సమావేశంలో చెప్పినప్పటికీ టీడీపి నాయకులు చేస్తున్న వితండవాదం ప్రజలు గమనిస్తున్నారన్నారు. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందనే నానుడి టీడీపీ నాయకులకు సూటవుతుందన్నారు. నిస్వార్ధమైన వాసన్నను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నగదు తరలిస్తున్న వాహనంతో కానీ, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులుతో కానీ బాలినేనికి కానీ ఆయన తనయుడు బాలినేని ప్రణీత్ కు కానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. అనవసరంగా రాజకీయం చేయాలనుకోవడం తెలుగుదేశం దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. జిల్లాలో తిరుగులేని రాజకీయ దురంధరుడిగా ఎదుగుతున్న వాసన్న తీరును చూస్తున్న టీడీపీ నాయకులకు నిద్రపట్టడం లేదన్నారు. ఇకనైనా నీతిమాలిన మాటలు మానుకోకపోతే వాసన్న సైన్యం ఉప్పెనగా మారి టీడీపీకి బుద్దిచెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
వైసీపీ మండల నాయకులు, వళ్లూరమ్మ ట్రస్ట్ మాజీ చైర్మన్ సూరం రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజల మన్ననలు పొందిన నాయకుడిపై ఇటువంటి నిరాధార ఆరోపణలు వేయడం తగదన్నారు. నిజం తప్పకుండా తెలుస్తుందని అన్నారు. అనంతరం వైసీపీ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ప్రదర్శనగా వెళ్లి మానవహారంగా ఏర్పడి నారా లోకేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఖబడ్దార్ నారా లోకేష్. ఖబడ్దార్ దామచర్ల జనార్దన్. డౌన్ డౌన్ నారా పప్పు అంటూ నినాధాలు చేశారు. కార్యక్రమంలో కురుగుంట్ల ఆశాలత మెమోరియల్ ట్రస్ట్ ఛైర్మన్, టంగుటూరు వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని కురుగుంట్ల స్నేహలత, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంగుంట రవిబాబు, వైసీపీ మహిళా నాయకురాలు బొడ్డపాటి అరుణ, తాటితోటి నరసింగరావు, నత్తల క్రాంతి, బొడ్డు శ్రీను, పారి ఆశీర్వాదం, జాన్ బాబు, ఎరుకల హక్కుల సంఘం నాయకులు పేరం సత్యం, ఈదర శ్రీను, ధర్మేంద్ర, ఓగూరి వెంకటేశ్వర్లు, సనగర చంద్ర, దేవరాల శ్రీను, దావులూరి సునీల్, బొట్ల సుబ్బారావు, అశోక్, పేరూరి కమలాకర్, గోసు కోటేశ్వరరావు, జి ఆనంద్, కె నవీన్ రెడ్డి, కె ఉమ, జి శ్రీకాంత్, జయరామ్, దామచర్ల శ్రీకాంత్, కోటి పాల్గొన్నారు.