Home ప్రకాశం మహిళల ఆర్థికాభివృద్దే చేయూత లక్ష్యం : చేయూత మార్ట్ ని ప్రారంభించిన సెర్ఫ్ సిఇఓ ఇంతియాజ్,...

మహిళల ఆర్థికాభివృద్దే చేయూత లక్ష్యం : చేయూత మార్ట్ ని ప్రారంభించిన సెర్ఫ్ సిఇఓ ఇంతియాజ్, కలెక్టర్ దినేష్ కుమార్, వైసీపీ ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు

499
0

టంగుటూరు (దమ్ము) : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టిన రోజు సందర్భంగా టంగుటూరులోని పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న చేయూత మహిళా మార్ఠ్ ను సెర్ఫ్ సిఇఓ ఇంతియాజ్ (ఐఏయస్), ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్, కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు, డిఆర్డిఏ పిడి బాబురావు ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్దే చేయూత లక్ష్యం అన్నారు. కొండపి వైసీపీ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు సొంత నిధులు రూ.1,22,000 (లక్షా ఇరవై రెండు వేల రూపాయలు)తో కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల విఓలకు చీరలు, జగనన్న పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఆటల పోటిలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజును మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి, సభకు విచ్చేసిన మహిళలకు, వైసీపీ శ్రేణులకు స్వీట్లు, హాట్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 19 మంది లబ్దిదారులకు సియం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో శ్రీనిధి ఎండి నాంచారయ్య, ఏపిఎంఐపి పిడీ రవీంద్రబాబు, జిల్లా ఉద్యానవనశాఖాధికారి గోపీచంద్, LDM యుగంధర్, టంగుటూరు యంపిపి పటాపంజుల కోటేశ్వరమ్మ, ఎఎంసి వైస్ ఛైర్మన్ చింతపల్లి హరిబాబు, కొండపి జడ్పీటీసీ మారెడ్డి అరుణ కుమారి, యంబిసి డైరెక్టర్ పుట్టా వెంకట్రావు, నాగేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ గొల్లపూడి సునీత, వైసీపీ సీనియర్ నాయకులు బీనీడి ఉదయ్ కుమార్, వెలుగు ఏపియం బెజ్జం రమేష్, శింగరాయకొండ మండల వైస్ యంపిపి సామంతుల రవికుమార్ రెడ్డి, వైసీపీ యువ నాయకులు సోమేపల్లి మురళీ కృష్ణ, వెలుగు ఏరియా కో ఆర్డినేటర్ రాంబాబు, వెలుగు సిసి వెంకట్రావు, వివిధ శాఖల అధికారులు, వైసీపీ శ్రేణులు ముఖ్యంగా మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.