టంగుటూరు (దమ్ము) : సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు 90శాతంపైగా అమలు చేశారని వైసిపి నాయకులు సోమేపల్లి మురళీకృష్ణ అన్నారు. అవ్వ, తాతల పెన్షన్ రూ.3వేలకు పెంచుతానన్న హామీ అమలైందని అన్నారు. సిఎం జగన్ చెప్పినట్టుగా కొత్త సంవత్సరంలో అందరికీ రూ.3వేలకు పెంచిన సందర్భంగా టంగుటూరు వైసీపీ నాయకులు సోమేపల్లి మురళి కృష్ణ చేతుల మీదుగా పెన్షన్ దారులకు పంపిణీ చేశారు.