టంగుటూరు (దమ్ము) : సేవకు మారుపేరు సెల్వన్ రాజు అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. టంగుటూరుకు చెందిన కురుగుంట్ల సెల్వన్ రాజుకు ఆదాయపు పన్ను శాఖ అధికారి నుండి ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) గా పదోన్నతి పొందిన సందర్బంగా పౌర సన్మాన కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి టంగుటూరు మసీద్ సెంటర్ వద్ద జరిగిన పౌరసన్మానంకు మంత్రి సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగంలోనూ, సమాజ సేవలోను అందరికీ ఆదర్శంగా సెల్వరాజ్ నిలిచారని అన్నారు. ఆశాలతా మెమోరియల్ ట్రస్ట్ స్తాపించి గత 20ఏళ్ల నుండి నిశ్వార్ధంగా విద్యార్థులకు, నిరాశ్రయులకు పుస్తకాలు,పెన్నులు, దుస్తులు, నిత్యావసర సరుకులు, వస్తువులు, వరదబాధితులకు, కరోనా కష్టకాలంలో సైతం ఎందరికో సేవలు అందించారని అన్నారు. ఎన్నో సహాయ సహకారాలు అందించిన సెల్వన్ రాజు పౌరసన్మానానికి నిజమైన అర్హుడని అన్నారు. అనంతరం సెల్వన్ రాజు, స్నేహలత దంపతులను శాలువాకప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. టంగుటూరు ఎంపీపీ పటాపంజుల కోటేశ్వరమ్మ, వైసీపీ నాయకులు డైరెక్టర్ పుట్టా వెంకట్రావు, బొట్ల రామారావు, మల్లవరపు కోటిరెడ్డి, కొమ్ము ప్రభుదాస్, తుల్లిబిల్లి అశోక్ బాబు, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ రమేష్ బాబు, ఎల్‌ఐసి నాగభూషణం, క్రీడ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ జోబ్, సిల్వన్ రాజు కుమారుడు డాక్టర్ సువర్ణరాజు, కుమార్తె డాక్టర్ మౌనిక, ఒంగోలు ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ ప్రకాష్ చాపల, డాక్టర్ అనిల్ కుమార్, పౌర సన్మాన కమిటీ సభ్యులు మురళి, కె జానుబాబు, టి డేవిడ్ రాజు, కె ఆనందరావు, జి రాజేష్, పి ఆశీర్వాదం, జి సుగుణకర్, షేక్ అలెగ్జాండర్, కె బాలకోటయ్య, పేరం ప్రభాకర్, బసవనం రాజు, గ్రీస్ మినిస్ట్రీస్ అధినేత జోబ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవప్రసాద్, పౌర సన్మాన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.