Home ప్రకాశం సెల్వన్ రాజు కుమారుడి పుట్టినరోజు వేడుకలు – పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

సెల్వన్ రాజు కుమారుడి పుట్టినరోజు వేడుకలు – పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

383
0

టంగుటూరు (దమ్ము) : ఆదాయపు పన్ను శాఖ అధికారి కురుగుంట్ల సెల్వన్ రాజు, స్నేహలత కుమారుడు డాక్టర్ సువర్ణరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా పంచాయితీ కార్యాలయం ఆవణలో డాక్టర్ సువర్ణరాజు పుట్టినరోజు కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఆశాలతా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 మంది పంచాయతీ పారిశుధ్య కార్మికులకు పది కేజీల బియ్యం బస్తా, కందిపప్పు, చింతపండు, వంటనూనె, ఉల్లిపాయలు, బట్టల సబ్బులు, స్తానం సబ్బులు వంటి నిత్యవసర సరుకులను అందజేశారు.

కార్యక్రమంలో ఆదాయపు పన్నుల శాఖ అధికారి కురుగుంట్ల సెల్వన్ రాజు, ఆశాలతా మెమోరియల్ ట్రస్ట్ డైరెక్టర్ కురుగుంట్ల స్నేహలత, టంగుటూరు పంచాయతీ వైస్ సర్పంచ్ మక్కెన కోటేశ్వరరావు మరియు సెల్వన్ రాజు కుటుంబ సభ్యులు, ఆశాలతా మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు, రిటైర్డ్ ఎంప్లాయిస్, అభిమానులు పాల్గొన్నారు.