టంగుటూరు (దమ్ము) : తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని టంగుటూరులో ఘనంగా నిర్వహించారు. వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. టీడీపీ మరియు ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాలావీరాంజనేయ స్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య తొలుత బొమ్మల సెంటర్, పంచాయతీ కార్యాలయం సమీపంలో, మసీద్ సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం టీడీపీ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో గడ్డం పూర్ణచంద్రరావు, వెంకటసుబ్బమ్మ జ్ఞాపకార్థం 61మంది పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. ఆటలపోటీలలో గెలుపొందిన విజేతలకు శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపి చదలవాడ చంద్రశేఖర్, టీడీపీ మండల అధ్యక్షులు కామని విజయ్ కుమార్, ఎన్టీఆర్ సేవాసమితి కన్వీనర్ రావూరి తిరుమల రాధాకృష్ణ, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, పంచాయతీ వైస్ సర్పంచ్ మక్కెన కోటేశ్వరరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బ్రాహ్మనందం, జక్కుల శ్రీను, కసుకుర్తి బాస్కర్, టిడిపి పట్టణ అధ్యక్షులు కామని శ్రీను, తెలుగు యువత మండల అధ్యక్షులు అబ్బురి అభిషేక్, టీడీపీ యువ నాయకులు కామని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.