Home ప్రకాశం అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి జగన్ చిత్తశుద్ధితో కృషి – మహిళా శిశు సంక్షేమశాఖా మంత్రి ఉషశ్రీ...

అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి జగన్ చిత్తశుద్ధితో కృషి – మహిళా శిశు సంక్షేమశాఖా మంత్రి ఉషశ్రీ చరణ్

221
0

టంగుటూరు (దమ్ము) : అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందని మహిళా శిశు సంక్షేమశాఖా మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మండలంలోని సూరారెడ్డిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉషశ్రీ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు బలోపేతానికి జగన్ ప్రభుత్వం నాడు నేడు పేరుతో కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తుందని, విశాలమైన గదులు ఏర్పాటు చేస్తుందని, చిన్నారుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే సహించేది లేదన్నారు.

మెనూ ప్రకారం ప్రతి రోజు చిన్నారులకు భోజనం పెట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా మీ ఇష్టారాజ్యంగా సాంబారు బదులు ఆకు కూరలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాలమైన గదుల్లో చిన్నారులకు భోదన చేయాలని, అంగన్వాడీ కేంద్రాలు పరిశుభ్రంగా ఉండాలని, ప్రభుత్వ పుస్తకాలు పిల్లలు దగ్గరే ఉండాలని, చిన్నారులను ఆకర్శించేలా అంగన్వాడీ కేంద్రాల్లో బొమ్మలు గోడలు మీద ఏర్పాటు చేయాలన్నారు. ఊరికి దూరంగా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయవద్దని, ఊరి మధ్యలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు గుర్తించి శాశ్వత భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు ఉండేలా జిల్లా అధికారులు పనిచేయాలని, నూతనంగా అంగన్వాడీ కేంద్రాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చిన్నారుల పట్ల నిర్లక్ష్యం వద్దని మెనూ ప్రకారం భోజనం పెట్టాల్సిందేనని, అంగన్వాడీ కేంద్రాలు పరిశుభ్రంగా ఉండాలి, విశాలమైన గదుల్లో చిన్నారులకు భోదన చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం చిన్నారులుతో మంత్రి కాసేపు ముచ్చటించారు. పిల్లలు తల్లితండ్రులతో చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు, టీచర్ల పనితీరుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ వై ధనలక్ష్మి, సిడిపిఓ మల్లీశ్వరి, సూపర్ వైజర్ సైరాబి, సింగరాయకొండ సీఐ దాచేపల్లి రంగనాథ్, టంగుటూరు ఎస్ఐ షేక్ ఖాదర్ భాషా తదితరులు ఉన్నారు.