టంగుటూరు (దమ్ము) : స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్ ను బుధవారం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, సెర్ఫ్ సిఇఓ ఇంతియాజ్ అహ్మద్ (ఐఏఎస్ ), కొండేపి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు ప్రారంభించారు.
ఈసందర్భంగా వైసీపీ యువ నాయకులు సోమేపల్లి మురళీ కృష్ణ సెర్ఫ్ సిఇఓ ఇంతియాజ్ అహ్మద్ (ఐఏఎస్)కు శాలువాకప్పి, పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు.