Home ప్రకాశం హనుమత్ జయంతి వేడుకలలో పోతుల

హనుమత్ జయంతి వేడుకలలో పోతుల

343
0

టంగుటూరు : స్థానిక పంచాయతీ కార్యాలయ సమీపంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో విగ్రహ దాతలైన మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు, ఆయన సోదరులు మాజీ వైస్ ఎంపీపీ పోతుల నరసింహరావు, పోతుల కృష్ణారావు, పోతుల ప్రసాద్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీరామ భక్తుడైన హనుమంతుని జయంతి వేడుకలు ప్రతియేడులా ఇప్పుడు కూడా ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వి వెంకటేశ్వర్లు పూజాకార్యక్రమాలు నిర్వహించి ప్రసాదంలు పంచిపెట్టారు. పోతుల అభిమానులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.