Home ప్రకాశం విద్యుత్ చార్జీలు తగ్గించాలని వామపక్షాల నిరసన

విద్యుత్ చార్జీలు తగ్గించాలని వామపక్షాల నిరసన

132
0

టంగుటూరు : పెంచిన కరెంట్ చార్జీలు తగ్గించాలని టంగుటూరు బొమ్మల సెంటర్ లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సిపిఎం టంగుటూరు మండల కన్వీనర్ వేసుపోగు మోజెస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ విద్యుత్ భారాల పై జరుగుతున్న పోరు బాటలో అందరు కలసి రావాలని కోరారు. మోడీ, జగన్ – బిజెపి, వైసిపి ఉమ్మడి బాదుడును తిప్పి కొట్టండని పిలుపునిచ్చారు.

విద్యుత్ బాదుడు ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు వద్దనే వద్దని డిమాండ్ చేశారు. మోడీ, జగన్ ఉమ్మడి కరెంట్ చార్జీల బాదుడుని తిప్పికొట్టండని ప్రజలకు పిలుపునిచ్చారు. మరో విద్యుత్ ఉద్యమానికి ప్రజలను సిద్ధం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.

ఈ కార్యక్రమం లో ఎమ్ఎల్ పార్టీ నాయకులు పి కోటేశ్వరరావు, న్యూడెమోక్రసి నాయకులు టీ వెంకటరావు, సిపిఐ నాయకులు టీ ప్రభాకర్, సిపిఎం నాయకులు టీ రాము, కే శ్రీనివాస్, టీ నారాయణరావు, ఎస్కె మీరాస్, జీ అంకయ్య, ch. సిసింద్రీబాబు, ఎం యానాది, సుశీల, భాస్కర్, ఎస్కె శ్రీను తదితరులు పాల్గొన్నారు.