Home ప్రకాశం గ్రామాన్ని అభివృద్ది చేసిన బెల్లం జ‌యంత్‌బాబు : దామ‌చ‌ర్ల‌

గ్రామాన్ని అభివృద్ది చేసిన బెల్లం జ‌యంత్‌బాబు : దామ‌చ‌ర్ల‌

733
0

టంగుటూరు : సర్పంచిగా బెల్లం జయంత్ బాబు టంగుటూరు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఒంగోలు శాసన సభ్యులు, టిడిపి జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్దన్ అన్నారు. టంగుటూరు పంచాయతీ కార్యాలయ సమీపంలో జరిగిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ మాట్లాడారు. గతంలో టంగుటూరు గ్రామం ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో మీరు అందరూ ఒక్కసారి గమనించాలని గ్రామ ప్ర‌జ‌ల‌ను కోరారు. మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, కామని విజయకుమార్ లు ఒక టీమ్ గా ఏర్పడి, నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజల కష్టాలు తెలుసుకొంటూ ప్రజలకు అన్ని విషయాల్లో అండగా ఉన్నార‌ని చెప్పారు. టంగుటూరు గ్రామాన్ని అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి గ్రామంలో మంచి వాతావరణం తీసుకు వచ్చారన్నారు.

కందుకూరు శాసనసభ్యులు పోతుల రామారావు టిడిపిలోకి రావడం బెల్లం కోటయ్య, జయంత్ బాబు ఈ రోజు అందరూ ఒకే పార్టీలో ఉండటం చాలా సంతోషకరమైన విషయమన్నారు. రాష్ట్ర‌ విభజన జరిగిన తర్వాత మనల్ని కట్టుబట్టలతో బయటకు పంపడం జరిగిందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనేక ఇబ్బందులలో ఉన్నప్ప‌టికీ చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకు వెళ్తున్నాడన్నారు. 24 గంటల కరెంటు, సిమెంట్ రోడ్లు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుండి అన్నివిధాలుగా లబ్ధి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మన ఎమ్మెల్యే స్వామి కూడా అందర్నీ కలుపుకుపోతూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. మన గ్రామ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులను గుర్తుంచుకుని, రెండు నెలల్లో వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ప‌నిచేయాల‌న్నారు. మన భావితరాలకు, మన ఊరు, మన నియోజకవర్గం బాగుండేలా చూడాల‌న్నారు. అంద‌రూ క‌ష్ట‌ప‌డి మన పార్టీని గెలిపించాలని కోరారు. మీరు కృషి చేశారు కాబట్టే మేమందరం ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్నామన్నారు.

కొండపి శాసనసభ్యులు డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నామ‌నుకున్నప్పటికీ, డ్రైనేజీ, చిన్న చిన్న పనులు మిగిలిపోయాయన్నారు. గ్రామంలో సుమారు 500 నుండి 600 మందికి ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సేకరించిన భూమి కొద్దిమందికే ఉన్నందువల్ల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. వీలయినంత త్వరలో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు తన సమర్థతతో, పరిపాలన దక్షతతో, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వచ్చారన్నారు. 16 వేల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ 23 కోట్ల అభివృద్ధిని ఈ గ్రామంలో చేపట్టామంటే ముఖ్యమంత్రి దార్శనికతకు ఇదే నిదర్శనమన్నారు. నిన్న జరిగిన జన్మభూమిలో సంక్రాంతి కానుకలుగా వృద్దాప్య, వితంతు, ఎన్టీఆర్ భరోసా వంటి అన్ని రకాల పెన్షన్లను ముఖ్యమంత్రి రెట్టింపు చేయడం జరిగిందన్నారు. ఇంకా ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకువచ్చారన్నారు. ముఖ్యమంత్రికి పేదలపట్ల శ్రద్ధకు నిదర్శనమే, ఈ సంక్షేమ పథకాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం గోదావరి, కృష్ణా నీళ్లు మన ప్రాంతానికి వ‌చ్చి, మన ప్రాంతం అభివృద్ధి చెందాల‌న్నా, మన గ్రామాలు సస్యశ్యామలం కావాల‌న్నా మహాసంఘమం జరగాలన్నారు. మహాసంఘమం పూర్తి కావాలంటే చంద్రబాబు ఈ రాష్ట్రానికి మ‌ళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. ఇది జరిగినప్పుడే రైతులు, కూలీలు సంతోషంగా ఉంటారన్నారు. గోదావరి, కృష్ణ నీళ్లు పెన్నా నదికి వచ్చినప్పుడే ముసి, పాలేరులోకి నీళ్లు వచ్చే అవకాశం ఉంద‌న్నారు. పార్టీలకతీతంగా సంక్షేమాలను అందించిన గొప్పతనం మనకుంది కాబట్టి పెద్దమనస్సుతో ఈ రాష్ట్రానికి ఎవరు అవసరమో గమనించుకుని మళ్ళీ చంద్రబాబుని గెలిపించాలని కోరారు.

మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు మాట్లాడుతూ మన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందులో భాగంగానే మన సంప్రదాయాలను గుర్తుంచుకునేలా, ఈ మూడు రోజుల పండుగలకు కార్యక్రమాలను ఏర్పాటు చేశామ‌న్నారు. రాబోయే రోజుల్లో గ్రామాన్ని, మండలాన్ని, రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి పరచగలరో అటువంటి వారిని మంచి మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామంలో అన్ని సమస్యలను పూర్తి చేసుకున్నామన్నారు. మంచి నీళ్ళు కూడా మన గ్రామానికి త్వరలో రాబోతున్నాయన్నారు. అతి త్వరలో మిగిలిన అన్ని పనులు పూర్తి చేసుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, స్వామి, దామచర్ల కుటుంబాలకు కృతజ్ఞతలు చూపాలన్నారు.

టీడీపీ యువనాయకులు దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ గ‌డిచిన‌ నాలుగు సంవత్సరాలలో టంగుటూరు గ్రామాన్నే కాకుండా నియోజకవర్గాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మనకు బాధ్యతలు పెరిగాయన్నారు. అంద‌రూ ఒకే పార్టీలో ఉన్నందున టంగుటూరులో ఒకేఒక్క‌టి తెలుగుదేశం పార్టీనే అన్నారు. కాబ‌ట్టి ప్ర‌జ‌లు ఆలోచించి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గెల‌వాలంటే అంద‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌న్నారు. రానున్న ఎన్నికలు చాలా కీలకమైన‌వ‌న్నారు. అభివృద్ధిలో ఎటువంటి రాజీలేకుండా అందరిని కలుపుకుపోవడంలో కృషి చేస్తామన్నారు. ఎంఎల్ఎ స్వామి కూడా అందరితో కలివిడిగా ఉంటారని అన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా స్వామిని, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిలను గెలిపించుకోవాల‌న్నారు. దామచర్ల, బెల్లం, పోతుల కుటుంబాలు అందరం క‌లిసిక‌ట్టుగా పార్టీ గెలుపుకు కృషి చేయాల‌న్నారు.

అనంతరం ఒంగోలు, కొండపి శాసనసభ్యులు జనార్దన్, స్వామి, టీడీపీ నాయకులు సత్యలను సంక్రాంతి సంబరాల కమిటీ శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు కామని విజయకుమార్, పత్తిపాటి వెంకటసుబ్బారావు పాల్గొన్నారు.