టంగుటూరు (దమ్ము) : టంగుటూరులో జరిగిన వైఎస్ఆర్ (ysr) 4వ విడత ఆసరా కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండపి నియోజకవర్గ వైసిపీ ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల, మత తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటికే అందించిన గొప్ప నాయకుడు జగనన్న (CM Ys Jaganmohanreddy) అన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేసారన్నారు. జగనన్న ఏకలవ్య శిష్యుడిగా మీకు సేవచేయడానికి వచ్చానన్నారు. మీ కుటుంబాలకు మంచి జరిగితే జగనన్నను ఆశీర్వదించాలని అన్నారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలచే సాంస్కృత కార్యక్రమాలు, డ్వాక్రా మహిళల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో డిఆర్డిఎ పీడీ టి వసుంధర, ఎంపీడీఓ, తహసీల్దార్, వైసిపీ మండల అధ్యక్షులు మల్లవరపు రాఘవరెడ్డి, ప్రకాశం జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్ చింతపల్లి హరిబాబు, ఎంపిపి పటాపంజుల కొటేశ్వరమ్మ, నిర్మల, జడ్పీటీసీ సభ్యులు అరుణ, వైస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కో-కన్వీనర్ భరత్ రెడ్డి, ఎంబసీ డైరెక్టర్ పుట్టా వెంకట్రావు, తుల్లిబిల్లి అశోక్, ఎఎంసి డైరెక్టర్లు రామకృష్ణ, సురేంద్ర, నవీన్, ఎంపీటీసీ ప్రభుదాస్, వైస్సాఆర్టిఎఫ్ నాయకులు సుధనగుంట వెంకటస్వామి, తన్నీరు వీరనారాయణ, సర్పంచ్ శ్రీనివాసరాజు, ఎంపీటీసీ నిర్మల, ఎంపీటీసీ బొడ్డు వాసంతి, ఎంపీటీసీ కోటేశ్వరరావు, జిల్లా చంద్ర, రమణారెడ్డి, పేరూరి కమలాకర్, నాయకులు తొట్టెంపూడి సురేష్, సురేంద్ర, సర్పంచ్ ఘాన్సీ, సర్పంచ్ ఆశీర్వాదం, నాయకులు రమణారెడ్డి, సుధాకర్, ఏలూరి వంశీ, రాజు, అలెగ్జాండర్, మండల స్థాయి అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.